Home / MOVIES / గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో జీవన్ బాబు

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో జీవన్ బాబు

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా తన నివాసంలో మొక్కలు నాటిన మ్యూజిక్ డైరెక్టర్ జీవన్ బాబు….

అనంతరం మాట్లాడుతూ రాబోయే తరాలకు ఆక్షిజన్ అందించాలంటే అందరూ మొక్కలు నాటాలని మ్యూజిక్ డైరెక్టర్ జీవన్ బాబు అన్నారు. రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతి ఒక్కరు మొక్కలు నాటేల గుర్తు చేస్తుందని జీవన్ బాబు అన్నారు.

సినీ గేయ రచయిత కాసర్ల శ్యామ్ విసిరిన గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరిస్తూ టోలిచౌకి లోని తన నివాసంలో మొక్కలు నాటిన మ్యూజిక్ డైరెక్టర్ జీవన్ బాబు…అనంతరం మరో ముగ్గురు (బిగ్ బాస్ 3 విన్నర్ రాహుల్ సిప్లి గంజ్ , హైమత్ , గిటారీస్ట్ & కంపోజర్ అరుణ్ చిలివేరు ) లు మొక్కలు నాటి మరో ముగ్గురికి గ్రీన్ ఛాలెంజ్ విసరాలని జీవన్ బాబు అన్నారు.