మాజీ ఎమ్మెల్యే, సిపిఎం సీనియర్ నాయకుడు సున్నం రాజయ్య మరణం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు.
ప్రజా సమస్యల పరిష్కారం కోసం తన జీవితాంతం కృషి చేసిన రాజయ్య, అత్యంత నిరాడంబర రాజకీయ నాయకుడిగా పనిచేశారు.
ప్రజల హృదయాల్లో నిలిచి పోతారని సిఎం అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.