Home / MOVIES / బర్త్ డే రోజు మెగా ఫ్యాన్స్ కు శుభవార్త

బర్త్ డే రోజు మెగా ఫ్యాన్స్ కు శుభవార్త

ఆగస్ట్ నెల ప్రారంభమైందంటే చాలు మెగాభిమానులకు పండగే. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి బర్త్‌డే ఈ నెలలోనే ఉంటుంది. ఆగస్ట్ 22వ తేదీ మెగాస్టార్ చిరంజీవి బర్త్‌డే.

అందుకే మెగాభిమానులకు ఈ నెల అంటే ఎంతో ఇష్టం. ఇక 10 రోజుల ముందు నుంచే మెగాస్టార్ బర్త్‌డే వేడుకలను స్టార్ట్ చేసి, రోజుకో కార్యక్రమం చొప్పున అభిమానులు సంబరాలు జరుపుతూ ఉంటారు.

ఈ సంవత్సరం పరిస్థితులు అంతగా సహకరించకపోయినా.. అభిమానులు మాత్రం వారికి అందుబాటులో ఉన్న విధంగా సంబరాలు ప్లాన్ చేస్తున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి కూడా తన అభిమానుల కోసం తన పుట్టినరోజున ఏదో ఒక సర్‌ప్రైజ్ ఇస్తుంటారు.

ఈసారి కూడా అభిమానులకు చక్కని ట్రీట్ ఇచ్చేందుకు మెగాస్టార్ రెడీ అవుతున్నట్లుగా మెగావర్గాల నుంచి తెలుస్తుంది.