Home / SLIDER / గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో సునీత

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో సునీత

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ నిర్వహిస్తున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం నిర్విరామంగా సాగుతోంది.ఒకరి నుండి మరొకరికి గ్రీన్ ఛాలెంజ్ స్వీకరిస్తూ సెలెబ్రిటీలు తమవంతుగా మొక్కలు నాటుతున్నారు.

సినీనటి సునీత మనోహర్ ఇచ్చిన గ్రీన్ ఛాలెంజ్ ని స్వీకరించి సంజీవయ్య పార్క్ లో మూడు మొక్కలు నాటారు.ఈ సందర్భంగా లోరా అమ్ము మాట్లాడుతూ… గౌరవ ఎంపీ సంతోష్ కుమార్ గారు నిర్వహిస్తున్న గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమం అపూర్వమైనదని ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ని ఒక ఐకానిక్ ప్రోగ్రాంగా దేశవ్యాప్తంగా మరింత ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్బంగా తనకు ఈ అవకాశాన్ని కల్పించిన ఎంపీ సంతోష్ గారికి ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందనీ అలాగే తను మరో ముగ్గురికి ఛాలెంజ్ ఇస్తున్నట్టు చెప్పారు. యాక్టర్ సంధ్య జానకి… యాక్టర్ స్వామి.. యాక్టర్.ఎర్రచెందే పూర్ణ గుప్తా .. వీళ్ళకి మొక్కలు నాటాల్సిందిగా నామినేట్ చేశారు.