Home / CRIME / నటి శ్రావణి మృతిపై దేవరాజ్ సంచలన వ్యాఖ్యలు..అసలు ఎవరు ఈ దేవరాజ్..?

నటి శ్రావణి మృతిపై దేవరాజ్ సంచలన వ్యాఖ్యలు..అసలు ఎవరు ఈ దేవరాజ్..?

నటి శ్రావణి ఆత్మహత్యకు తాను కారణమంటూ వైరల్‌ అవుతున్న వార్తలను దేవరాజ్‌ ఖండించాడు. ఆమె మృతికి, తనకు సంబంధం లేదని ఓ వీడియో రికార్డు విడుదల చేశాడు.

శ్రావణి ఆత్మహత్యకు ఆమె కుటుంబ సభ్యులతో పాటు, సాయికృష్ణ అనే మరో వ్యక్తి కారణమని.. తనను కలవద్దంటూ కుటుంబ సభ్యులు ఆమెను కొట్టడంతోనే మనస్తాపం చెంది శ్రావణి ఆత్మహత్య చేసుకుందన్నారు.

ఈ విషయం శ్రావణి చివరిసారిగా తనకు ఫోన్‌ చేసి చెప్పిందన్నారు. తాను ఆమె వద్ద డబ్బులు డిమాండ్‌ చేసినట్లు వస్తున్న ఆరోపణలు అవాస్తవమని దేవరాజ్‌ తెలిపాడు. కుటుంబసభ్యుల ఒత్తిడితోనే జూన్‌లో ఆమె తనపై పోలీస్‌ కేసు పెట్టిందని పేర్కొన్నాడు.

నిజానికి శ్రావణి తనను ప్రేమించిందని చెప్పాడు. గతంలో తాను, శ్రావణి కలిసి డిన్నర్‌కి వెళ్లామని.. అక్కడికి సాయి అనే వ్యక్తి వచ్చి శ్రావణిపై చేయి చేసుకున్నట్టు దేవరాజ్‌ చెప్పాడు. ‘‘మా నాన్న, అమ్మ చాలా దారుణంగా కొట్టారు.

మా తమ్ముడు నన్ను హింసించాడు. సాయి అనే వ్యక్తి రోడ్డుపై జుట్టు పట్టుకుని కొట్టాడు. వీళ్ల మొహాలు జీవితంలో చూడ దలుచుకోలేదు. నా చావుకు కారణం సాయి’’ అని శ్రావణి చివరిగా తనతో చెప్పిందని దేవరాజ్‌ వీడియోలో పేర్కొన్నాడు.