Home / SLIDER / తెలంగాణోచ్చాకే అభివృద్ధి

తెలంగాణోచ్చాకే అభివృద్ధి

తెలంగాణ రాష్ర్ట ప్ర‌జ‌ల గోడు అర్థ‌మ‌య్యేలా బీజేపీకి డిపాజిట్లు గ‌ల్లంత‌య్యేలా దుబ్బాక ప్ర‌జ‌లు తీర్పు చెప్పాల‌ని మంత్రి హ‌రీష్ రావు అన్నారు. జిల్లాలోని దుబ్బాక నియోజ‌క‌వ‌ర్గం పద్మనాభునిపల్లి గ్రామంలో మంత్రి హరీశ్ రావు పర్యటించారు.

ఈ సంద‌ర్భంగా గ్రామ‌స్తులు బాణాసంచా పేల్చి డప్పు చప్పుళ్లతో అడుగడుగునా మంత్రికి ఘన స్వాగతం పలికారు. గ్రామ మహిళలు మంగళహారతులు పట్టి, కుంకుమ తిలకం దిద్దారు. ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్య‌ర్థికి త‌మ సంపూర్ణ మ‌ద్ద‌తు తెలుపుతూ గ్రామ‌స్తులు తీసుకున్న ఏక‌గ్రీవ తీర్మాణ ప‌త్రాన్ని పంచాయతీ పాలక వర్గం ఆధ్వర్యంలో గ్రామ‌స్తులు మంత్రికి అందించారు.

కుల‌సంఘాలు త‌మ మ‌ద్ద‌తు తెలుపుతూ తీర్మాణ ప‌త్రాల‌ను అంద‌జేసి ఎల్ల‌మ్మ దేవాల‌యంలో ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి హ‌రీష్ రావు మాట్లాడుతూ.. గ్రామ‌స్తులు టీఆర్ఎస్‌పై ఉంచిన న‌మ్మ‌కానికి శిర‌స్సు వంచి ధ‌న్య‌వాదాలు తెలుపుతున్నార‌న్నారు.