Home / MOVIES / సరికొత్త పాత్రలో పూర్ణ

సరికొత్త పాత్రలో పూర్ణ

శ్రీమ‌హాల‌క్ష్మి సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది కేర‌ళ కుట్టి పూర్ణ‌. ఆ త‌ర్వాత సీమ‌ట‌పాకాయ్‌, అవును, అవును 2, రాజుగారి గ‌ది వంటి చిత్రాల్లో న‌టించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. మ‌హేశ్ బాబు న‌టించిన శ్రీమంతుడులో కూడా మెరిసింది. ఇప్ప‌టివ‌ర‌కు గ్లామ‌ర్ రోల్స్ చేసిన ఈ భామ ఇపుడు నెగెటివ్ రోల్ లో అల‌రించేందుకు సిద్ద‌మ‌వుతోంది. రాజ్‌తరుణ్-విజ‌య్ కుమార్ కొండా కాంబినేష‌న్ లో సినిమా తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. రొమాంటిక్ థ్రిల్ల‌ర్ గా రానున్న ఈ మూవీలో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర కోసం పూర్ణ అయితే బాగుంటుంద‌ని..డైరెక్ట‌ర్ విక్ర‌మ్ కుమార్ కొండా ఫిక్స‌య్యాడ‌ట‌.

అంతేకాదు ఈ రోల్ కోసం పూర్ణ మేకోవ‌ర్ ను కూడా కొద్దిగా మార్చాల్సి ఉంటుంద‌ని చెప్పిన‌ట్టు టాక్‌. వ‌న‌మాలి క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై అనంత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మ‌రి పూర్ణ ఈ సారి కొత్త లుక్ లో ప్రేక్ష‌కుల‌ను ఎలా ఎంట‌ర్ టైన్ చేస్తుందో చూడాలి. పూర్ణ ఈ ఏడాది తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం, హిందీ భాష‌ల్లో సినిమాలు చేస్తోంది.