తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి బిజెపి పార్టీ నుండి టిఆర్ఎస్ పార్టీలో అల్వాల గ్రామానికి చెందిన ఉప సర్పంచ్ దిలీప్, నమిలే రవి, ధర్మారం మాజీ ఎంపిటిసి శ్రీనివాస్ దళిత మోర్చా రాష్ట్ర కన్వీనర్ మందారం ఎల్లయ్య ఆధ్వర్యంలో సుమారుగా 150 తోపాటు కొంతమంది యువకులు భారీగా మంత్రి హరీష్ రావ్ ఆధ్వర్యంలో లో టిఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి చేస్తున్న అభివృద్ధి పనులు దేశానికి మరువలేనిదన్నారు తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఇంటికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ తోనే సాధ్యమైందన్నారు దుబ్బాక నియోజక వర్గంలో ఉప ఎన్నికల బరిలో ఉన్న సోలిపేట సుజాత ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించి కోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో సంగారెడ్డి మాజీ శాసనసభ్యులు చింత ప్రభాకర్ ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ కార్యదర్శులు రాధాకృష్ణ శర్మ బక్కీ వెంకటయ్య ఎంపీపీ ప్రజల సాయిలు వైస్ ఎంపీపీ పోలీస్ రాజు మాజీ ఎంపీపీ భాస్కరాచారి మాజి మార్కెట్ కమిటీ చైర్మన్ గంట బాపురెడ్డి పంజాల శ్రీనివాస్ గౌడ్ సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు బాలరాజు కొ ఆప్షన్ సభ్యులు హైమద్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.