ఉపాధ్యాయ పోస్టులు ఎన్ని ఖాళీలున్నాయి? ఎక్కడ ఎక్కువమంది పనిచేస్తున్నారు? సర్దుబాట్లు పోను ఖాళీల లెక్కపక్కాగా తేల్చేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు వేగవంతం చేసింది.
విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయుల నియామకానికి ముమ్మర కసరత్తు మొదలైంది. పాఠశాల విద్యాశాఖలో అన్నిరకాల పోస్టుల కలిపి దాదాపు 25 వేల ఖాళీలున్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇందులో జిల్లాలవారీగా పదోన్నతులు పోను.. మిగిలిన పోస్టులను డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేయనున్నారు.
ఉన్న ఖాళీలతోపాటు పదవీ విరమణలు, మరణాల వల్ల కూడా ఖాళీలు ఏర్పడుతున్నాయని సమాచారం. టీచర్ల రేషనలైజేషన్ చేయాల్సిన అవసరం ఉంటుందా? లేదా? అన్న అంశంపై అధికారులు త్వరలోనే స్పష్టత ఇవ్వనున్నారు.