అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని జుక్కల్ ఎమ్మె ల్యే హన్మంత్‌షిండే అన్నారు. బుధవారం నిజాంసాగర్ ప్రాజెక్టులో రొయ్య పిల్లలను విడుదల చేశా రు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభు త్వం మత్స్యకారులను ఆదుకునేందుకు నెల రోజు ల కిందటే చేప పిల్లలను ఉచితం గా విడుదల చేసిందని గుర్తు చేశారు. ప్రస్తుతం 24.09 లక్షల రొయ్య పిల్లలను విడుదల చేయడమే లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు.
ప్రస్తుతం 14.09 లక్షల రొయ్య పిల్లలు నీలకంఠ జాతికి చెందినవి విడుదల చేశామని మిగిలిన పది లక్షల పిల్లలను మరో వారం రోజుల్లో విడుదల చేస్తామని తెలిపారు. కులవృత్తులకు పూ ర్వవైభవం తీసుకురావడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభు త్వం పని చేస్తోందన్నారు.