Home / MOVIES / ఆదిపురుష్‌ ఓ అద్భుత ప్రపంచం

ఆదిపురుష్‌ ఓ అద్భుత ప్రపంచం

ప్రభాస్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘ఆది పురుష్‌’. ఓంరౌత్‌ దర్శకత్వం వహిస్తున్నారు. టీ సిరీస్‌ సంస్థ నిర్మిస్తోంది. రామాయణ ఇతిహాసం ఆధారంగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్ర మోషన్‌ క్యాప్చర్‌ షూటింగ్‌ మంగళవారం నుంచి మొదలైంది.

ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ ‘అంతర్జాతీయ సినిమాల్లో వాడే అత్యాధునిక విజువల్‌ ఎఫెక్ట్స్‌తో ‘ఆదిపురుష్‌’ కోసం ఓ అద్భుతమైన ప్రపంచాన్ని సృష్టించబోతున్నాం. అత్యున్నత సాంకేతిక ప్రమాణాల్ని ఉపయోగిస్తూ ఇండియాలో తెరకెక్కుతున్న తొలి భారీ చిత్రమిదే కావడం గర్వంగా ఉంది.

మా అందరి కెరీర్‌లో ఈ సినిమా ఓ మైలురాయిగా నిలుస్తుందనే నమ్మకముంది’ అని తెలిపారు. ఫిబ్రవరి 2వ తేదీ నుంచి ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ను ప్రారంభించబోతున్నారు. ఈ సినిమాలో ప్రభాస్‌ రాముడిగా కనిపించబోతున్నారు. ప్రతినాయకుడిగా బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌ నటించనున్నారు.