Home / SLIDER / అన్ని విధాలుగా తెలంగాణ ను ఆదుకున్నది వరంగల్ జిల్లానే

అన్ని విధాలుగా తెలంగాణ ను ఆదుకున్నది వరంగల్ జిల్లానే

వరంగల్ లోని హరిత హోటల్ లో జరిగిన సమావేశంలో తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఉమ్మడి వరంగల్ జిల్లా డైరీ – 2021 ని ఆవిష్కరించిన రాష్ట్ర మంత్రులు శ్రీనివాస్ గౌడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, వరంగల్ నియోజకవర్గ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, ఉద్యోగ సంఘాల నాయకులు పరిటాల సుబ్బారావు, కారం రవీందర్ రెడ్డి, జగన్ మోహన్ రావు, సత్యనారాయణ, రాజేందర్, అంజ ద్, హాసన్ తదితరులు.

మంత్రులు శ్రీనివాస్ గౌడ్ కామెంట్స్
నాటి ఉద్యమం నుంచి నేటి వరకు అన్ని విధాలుగా తెలంగాణ ను ఆదుకున్నది వరంగల్ జిల్లా నే. తెగించి కొట్లాడి న బిడ్డలు వరంగల్ బిడ్డలు. ఉద్యోగులు. అధికారుల సంఘాలు పెట్టాలంటే నే భయపడిన సందర్భాల్లో… అండగా ఉంది వరంగల్ బిడ్డలే. వరంగల్ పై సీఎం కేసీఆర్, కేటీఆర్ లకు ప్రత్యేక అభిమానం ఉంది. ఇంటింటికీ మంచినీరు, సాగు నీరు, 24గంటల విద్యుత్, కెసిఆర్ కిట్లు, పెన్షన్లు, గురుకుల విద్యా సంస్థలు ఇలా అనేక విజయాలు ఉన్నాయి. గతంలో మనం ఆశించిన దానికంటే, అధికంగా 43శాతం ఫిట్ మెంట్ వచ్చింది. అనేకమంది ఉద్యోగులకు జీతాలు 300 శాతం వరకు పెంచుకున్నం. నెల రోజుల్లో 70వేల మంది అధికారులు, ఉద్యోగులకు పదోన్నతులు కల్పించిన0. ప్రతిపక్షాలను పట్టించుకోవాల్సిన పని లేదు. వాటి మాటలను లెక్క చేయకండి. గతంలో ఎప్పుడూ లేనంత అభివృద్ధిని సాధించిన0. నాటి ఉద్యమం నుంచి, నేటి తెలంగాణ అభివృద్ధి వరకు మన భాగస్వామ్యం ఉంది. అందుకే ఉద్యోగులు కాస్త ఎక్కువ అడుగుతున్నారు. గతంలో అడిగిన వెన్నో ఇచ్చిన ఘనత సీఎం కెసిఆర్ ది. మన ఉద్యోగులు ప్రభుత్వానికి అండగా ఉండాలి. అవసరమైన వాటి కోసం కొట్లాడాలి. మెప్పించి ఒప్పించాలి. ఎవరికి వారు ఇష్టానుసారం మాట్లాడొద్దు. బాధ్యతను ఉద్యోగ సంఘాల నాయకుల మీద పెట్టండి. అందరినీ సంప్రదించి, సమీక్షించిన తర్వాత వచ్చే ఫలితం సంతృప్తి కరంగా ఉంటుంది.

మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారి కామెంట్స్
ఉద్యోగులకు నా మద్దతు ఎప్పుడూ ఉంటుంది. ఉద్యోగులంతా సీఎం కెసిఆర్ గారికి మంచి మిత్రులు. మీకు అన్యాయం జరగదని పూర్తి విశ్వాసం వ్యక్తం చేస్తున్నా. ప్రతిపక్షాలు మాట్లాడే తీరు బాగాలేదు. వేరే రాష్ట్రాల్లో, వారు పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో పరిస్థితి ఏంటో అందరికీ తెలుసు. సీఎం గారు మనసున్న మహా రాజు. నాక్కూడా ఉద్యోగ సంఘాల నాయకులు నాకు చిరకాల మిత్రులు. సీఎం గారికి అన్నీ తెలుసు. అంతా సంతోష పడే విధంగా ఫిట్ మెంట్ ఉంటుందని ఆశిస్తున్నా. నమ్ముతున్న.

చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ కామెంట్స్
ఉద్యోగుల ఫిట్మెంట్ వ్యవహారాన్ని సీఎం గారు చూసుకుంటారు. సీఎం కెసిఆర్ దగ్గర దేర్ హోతా మగర్ అందేరా నహీ హితా!. ఎవ్వరూ ఆందోళన పడొద్దు. నన్ను ఆందోళనలో పడేయొద్దు. అందరికీ మంచే జరుగుతుంది.

ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ కామెంట్స్
తమ ఉద్యోగాలను సైతం లెక్క చేయకుండా నాడు ఉద్యమించిన ఉద్యోగులకు అభినందనలు. తండ్రి కొడుకుల అనుబంధం సీఎం కెసిఆర్ – ఉద్యోగ సంఘాల ది. బొమ్మరిల్లు సినిమా లో లా తండ్రి కొడుకులు గెలుస్తారు.ఈ కార్యక్రమంలో పలు సంఘాల రాష్ట్ర నాయకులు, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా tgo నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat