ఏపీ అధికార వైసీపీ అధినేత,ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి పై ప్రతిపక్ష పార్టీలైన టీడీపీ,బీజేపీ,జనసేన,కమ్యూనిస్టులు ఒక్క మాట మాట్లాడినా. వైసీపీ నేతలు మూకుమ్మడిగా స్పందిస్తారు.
అలాగే సీఎం జగన్ ను కూడా ప్రశంసిస్తుంటారు. కుప్పంలో వైసీపీకి చెందిన మద్దతుదారులు అత్యధిక స్థానాల్లో గెలవడంపై స్పందించిన డిప్యూటీ సీఎం నారాయణ స్వామి.. ‘ ప్రజలకు ఇంత మేలు చేస్తున్న జగన్ ఒకసారి ప్రధాని కావాలి. ఇందుకోసం దేవుడ్ని ప్రార్థిస్తున్నా, కుప్పం ప్రజలకు చంద్రబాబు చరిత్ర తెలుసు అందుకే తగిన బుద్ధి చెప్పారు’ అని అన్నారు.