Home / SLIDER / సీఎం సహాయ నిధి చెక్కును అందజేసిన ఎంపీ రంజీత్ రెడ్డి

సీఎం సహాయ నిధి చెక్కును అందజేసిన ఎంపీ రంజీత్ రెడ్డి

చేవెళ్ల మండలం పరిధిలోని బాధితులకు సీఎం సహాయ నిధి క్రింద నాలుగు లక్షల రూపాయల చెక్కును గురువారం చేవెళ్ల ఎంపీ డాక్టర్ జి.రంజీత్ రెడ్డి అందజేశారు.గొల్లగూడెం గ్రామం నిరుపేద కుటుంబానికి చెందిన వెంకట్ యాదవ్ కుమారుడు శ్రీకాంత్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నరని స్థానిక యూత్ అధ్యక్షులు వనం లక్ష్మీ కాంత్ రెడ్డి ద్వారా తెలుసుకున్న ఎంపీ రంజీత్ రెడ్డి.చికిత్స కు కావలసిన మొత్తం కట్టలేని స్థితిలో వున్న వారి కుటుంబ స్థితి గతిని ఎంపీ తన లెటర్ హెడ్ ద్వారా ముఖ్యమంత్రి సహాయనిధికి వివరించారు..

వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి కార్యాలయం చికిత్స కావలసిన రూపాయలను చెక్కు రూపంలో మంజూరు చేయడం జరిగింది.ఈ సందర్భంగా ఎంపీ రంజీత్ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం సహాయనిధి తో ఎంతో మంది పేద ప్రజలకు మేలు జరుగుతుందని..ఈ పథకాన్ని బాధితులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ రామ చంద్రయ్య,గుజిలయ్య,వార్డ్ మెంబర్ నర్సింలు తదితరులు పాల్గొన్నారు