మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో.. బన్నీ వాసు నిర్మాతగా కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘చావు కబురు చల్లగా’. ఎనర్జిటిక్ యంగ్ హీరో కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంటగా నటించారు. ఈ చిత్రంలో యాంకర్ అనసూయ ఐటమ్ సాంగ్ చేస్తున్నట్లుగా చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే.
తాజాగా ఆ ఐటమ్ సాంగ్‌కి సంబంధించిన ప్రోమోని చిత్రయూనిట్ విడుదల చేసింది. ‘పైన పటారం లోన లొటారం’ అంటూ సాగే ఈ మాస్ ఐటమ్ సాంగ్ ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాని ఊపేస్తుంది.
ఫుల్ సాంగ్‌ను మార్చి 1న 4 గంటల 5 నిమషాలకి విడుదల చేస్తున్నట్లుగా చిత్రయూనిట్ ప్రకటిస్తూ.. తాజాగా సాంగ్ ప్రోమోని విడుదల చేసింది. కార్తికేయ – అనసూయ మాస్ స్టెప్పులతో అదిరిపోయేలా ఈ పాట రూపొందినట్లుగా ఈ ప్రోమో చెప్పేస్తుంది.