అయోధ్య రామ మందిర నిర్మాణం కోసం విరాళల సేకరణ కార్యక్రమం శనివారంతో ముగిసింది. 44 రోజులపాటు సాగిన ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా లక్షలాది మంది విరాళాలు సేకరించారు. మొత్తంగా రూ.2 వేల కోట్ల వరకూ విరాళాలు వచ్చినట్లు ట్రస్ట్ అధికారులు వెల్లడించారు.
అయితే ఇందులో ఇంకా చాలా వరకు డబ్బును ఇంకా బ్యాంకుల్లో డిపాజిట్ చేయాల్సి ఉన్నట్లు వాళ్లు తెలిపారు. ఈ ప్రక్రియ మొత్తం పూర్తయితే.. విరాళాల మొత్తం మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. విరాళాలుగా వచ్చిన మొత్తం సొమ్మును శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఖాతాల్లో జమ చేయనున్నారు.