Home / ANDHRAPRADESH / వైఎస్ షర్మిలకు మంత్రి గంగుల సలహా

వైఎస్ షర్మిలకు మంత్రి గంగుల సలహా

తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ తొమ్మిదో తారీఖున కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతున్న ఏపీ ముఖ్యమంత్రి,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి సోదరిమణి వైఎస్ షర్మిలపై తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ విమర్శలు గుప్పించారు.

తెలంగాణ కోడలు అని చెబుతున్న షర్మిల.. బలవంతంగా ఏపీలో కలిపిన ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను తిరిగి ఇప్పించాలని డిమాండ్ చేశారు. ఆ ఏడు మండలాల కోసం పాదయాత్ర చేస్తే ఇక్కడి ప్రజలు షర్మిలను తెలంగాణ కోడలిగా నమ్ముతారని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజలను కేసీఆర్ కన్నబిడ్డల్లా చూసుకుంటున్నారని, ఇతర ప్రాంతాల వాళ్ల ప్రాతినిధ్యం అవసరం లేదన్నారు