తెలంగాణలో సిద్దిపేట జిల్లాలోని కొండపోచమ్మ కెనాల్ నుంచి కొండకండ్ల రిమ్మనగూడ వద్ద కూడవెల్లి వాగులోకి మంగళవారం గోదావరి జలాలను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు విడుదల చేశారు.
అంతకు ముందు ఆయనకు రిమ్మనగూడ వద్ద మంగళహారతులు, డప్పుచప్పుళ్లతో రైతులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. కూడవెల్లి వాగులోకి గోదావరి జలాలు విడుదల చేయడంతో గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గ రైతుల సాగునీటి కష్టాలు తీరనున్నాయి.
రెండు నియోజకవర్గాల్లోని 11వేల ఎకరాలకు సాగునీరు అందనుంది. సాగునీరు విడుదల చేయడంపై సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావుకు నియోజకవర్గ రైతులు కృతజ్ఞతలు తెలిపారు. కూడవెల్లి వాగుపై గజ్వేల్, తొగుట, దుబ్బాక మండలాల్లో 36 చెక్‌డ్యామ్‌లు జలకళను సంతరించుకోనున్నాయి.