అది టాలీవుడ్ అయిన బాలీవుడ్ అయిన అఖరికీ కోలువుడ్ అయిన కానీ హీరోయిన్లకు పెళ్లయ్యాక సినిమా అవకాశాలు తగ్గిపోతాయి.అవకాశాలు తగ్గిపోవడంతో మధర్ క్యారెక్టర్..సిస్టర్ క్యారెక్టర్..సపోర్టు క్యారెక్టరో వేయడానికి సిద్ధమవుతారు.
ఈ క్రమంలోనే కోలీవుడ్ లో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన అనేక మంది హీరోయిన్లు వివాహం తర్వాత ఇలాంటి అవకాశాలు రాక కనుమరుగయ్యారు. ఇపుడు ఇదే పరిస్థితి నటి కాజల్ అగర్వాల్ కు ఏర్పడింది.
ప్రస్తుతం ఈమె చేతి నిండా తెలుగు, తమిళ చిత్రాలు ఉన్నా.. అవన్నీ పెళ్లికి ముందు కుదుర్చుకున్న ప్రాజెక్టులు. దీంతో కోలీవుడ్లో తన ప్లేస్ కాపాడుకునేందుకు విలన్ పాత్రలకు సిద్ధమేనని స్పష్టం చేసింది