తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ హోళీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అయితే, కరోనా వైరస్ మళ్లీ ప్రబలుతున్న నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ప్రజలు వీధుల్లో గుంపులుగా చేరకుండా ఎవరి ఇండ్లలో వారే ప్రశాంతంగా పండుగ చేసుకోవాలన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో బహిరంగ ప్రదేశాల్లో గుమిగూడటంవల్ల కరోనా మహమ్మారి మరింత వేగంగా ప్రబలే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అందరూ కొవిడ్ నిబంధనలు పాటిస్తూ వైరస్ కట్టడిలో తమ వంతు పాత్ర పోషించాలని సీఎం కేసీఆర్ కోరారు.