Home / ANDHRAPRADESH / వైసీపీ ఎమ్మెల్యే కన్నుమూత

వైసీపీ ఎమ్మెల్యే కన్నుమూత

ఏపీ అధికార పార్టీ వైసీపీలో విషాదం నెలకొన్నది. ఆ పార్టీకి చెందిన కడప జిల్లా బద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే   డాక్టర్ గున్ తోటి వెంకటసుబ్బయ్య కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు.

తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వెంకటసుబ్బయ్య కొద్దిరోజులపాటు హైదరాబాద్‌లో చికిత్స పొంది మునిసిపల్ ఎన్నికల ముందు డిశ్చార్జ్ అయ్యి స్వగ్రామానికి చేరుకున్నారు.

ఎన్నికల ప్రచారంలోనూ ఆయన చురుగ్గా పాల్లొన్నారు. అయితే మళ్లీ అనారోగ్యానికి గురవ్వడంతో సుబ్బయ్యను కడపలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కుటుంబ సభ్యులు చేర్పించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం ఎమ్మెల్యే కన్నుమూశారు.