ఇటు తెలుగు అటు తమిళ హిందీ భాషలలో సత్తా చాటుతున్న అందాల రాక్షసి రాయ్ లక్ష్మీ. నటిగా వెండితెరకు ఎంట్రీ ఇచ్చిన రాయ్ లక్ష్మీ స్పెషల్ సాంగ్స్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. నందమూరి బాలకృష్ణ నటించిన అధినాయకుడు సినిమాలో హీరోయిన్గా నటించిన ఈ ముద్దుగుమ్మ పవన్ కళ్యాణ్ చిత్రం సర్ధార్ గబ్బర్ సింగ్, చిరంజీవి రీఎంట్రీ చిత్రం ఖైదీ నెంబర్ 150 సినిమాలో స్పెషల్ సాంగ్స్ చేసి తెలుగు ఆడియన్స్‌కు మరింత దగ్గరైంది.
ప్రస్తుతం రాయ్ లక్ష్మీ చేతిలో రెండు తమిళ సినిమాలు ఒక తెలుగు సినిమా, ఒక కన్నడ, ఒక మలయాళ సినిమా ఉన్నాయి.తాజాగా రాయ్ లక్ష్మీ తన సోషల్ మీడియా ద్వారా ఈ నెల 27న నిశ్చితార్థం చేసుకోబోతున్నట్టు పేర్కొంది.
నా జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాలను ఇప్పుడే బయట పెట్టాలనుకోవడం లేదు. గత వారమే సన్నిహితులకు, ఫ్రెండ్స్‌కు ఇన్విటేషన్ పంపాను. ఇది ముందు ప్లాన్ చేసినది కాదు, అనుకోకుండా జరుగుతున్నది. నా లవ్‌తో జీవితాన్ని పంచుకోవడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను అని రాయ్ లక్ష్మీ పేర్కొంది.