తెలుగు సినిమ ఇండస్ట్రీకి చెందిన అందాల రాక్షసి హన్సికతో సరికొత్త సినిమా ప్రయోగం చేయబోతున్నారు. రుధ్రార్ష్ సెల్యూలాయిడ్ పతాకంపై.. బొమ్మక్ శివ నిర్మాణంలో హన్సిక మోత్వాని ముఖ్య పాత్రలో ‘105 మినిట్స్’ అనే ప్రయోగాత్మక చిత్రం తెరకెక్కిస్తున్నారు.
‘సింగిల్ షాట్’, ‘సింగిల్ క్యారెక్టర్’, ‘రీల్ టైం అండ్ రియల్ టైం’ ఈ చిత్రానికి హైలెట్స్ అని చెబుతున్నారు. ఒకే ఒక్క క్యారెక్టర్తో ఎడిటింగ్ లేకుండా ఉత్కంఠ భరితంగా సాగే డ్రామా అని చెబుతున్నారు.