తెలంగాణ రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా ఇల్లంతకుంట మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, న్యాఫ్స్‌కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావుతో పాటు తదితరులు పాల్గొన్నారు. ఆ తర్వాత వివేకానంద విగ్రహం దగ్గర సెంట్రల్ లైటింగ్ సిస్టం, బస్టాండ్ వద్ద మహిళా సంఘ భవనం, తాసిల్ నూతన కార్యాలయ భవనం, రైతువేదిక, కూరగాయల అంగడిని ప్రారంభిస్తారు. అనంతరం అక్కడే నిర్వహించే బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు