తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. సీతారాముల ఆశీస్సులు రాష్ట్ర ప్రజలకు ఉండాలని, అందరూ సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.
ఏటా వైభవంగా జరిగే శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవాన్ని కరోనా కారణంగా సామూహికంగా జరుపుకోలేక పోతున్నామని పేర్కొన్నారు. భద్రాచలంలో రాములోరి కల్యాణాన్ని నిర్వహిస్తున్నామని, భక్తులు టీవీల ద్వారా వీక్షించాలని కోరారు.