హీరోయిన్ ఇలియానా సినీ రంగంపై తాజాగా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ‘సినిమా అనే రంగుల ప్రపంచంలో కనిపించని చీకటి కోణాలు ఎన్నో ఉన్నాయి.
కష్టానికి తగిన ప్రతిఫలం ఇక్కడ ఏ మాత్రం లభించదు. ప్రేక్షకుల ఆదరణ లభించినంత కాలమే గౌరవం ఉంటుంది.
ఒక్కసారి ఇమేజ్ తగ్గిపోతే పట్టించుకునే వారెవరూ ఉండరు. కొన్నింటిని చూస్తూనే ఉండాలి. ధనార్జనే అంతిమలక్ష్యంగా పరిశ్రమ పనిచేస్తుంది’ అని ఇలియానా చెప్పింది.