తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ పార్టీకి ఇటీవల గుడ్ బై చెప్పిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరే ముహూర్తం ఫిక్స్ అయ్యింది.
ఈ నెల 13 న ఈటల రాజేందర్ బీజేపీలో చేరనున్నారు. ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఈటల కాషాయ కండువా కప్పుకోనున్నారు.
ఈయనతో పాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, టీఆర్ఎస్ మహిళా విభాగం మాజీ నేత తుల ఉమ తదితరులు కమలదళంలోకి చేరనున్నారు.