ఓ వివాదాస్పద హీరోయిన్‌కు సిగరెట్ తాగే అలవాటు ఉంది. ఎవరేమంటారనులే అనుకుందేమో..లొకేషన్‌లో సిగరెట్ తాగుతూ కెమెరాకు చిక్కింది. ఆ ఫొటో నెట్టింట వైరల్ అయ్యింది. అయితే హీరోయిన్ లొకేషన్‌లో సిగరెట్ తాగడం సదరు మూవీ డైరెక్టర్‌కి నచ్చలేదు. దాంతో ఆమెకు వార్నింగ్ ఇచ్చాడు. ఆమె కూడా డైరెక్టర్ వార్నింగ్‌ను సీరియస్‌గానే తీసుకుని లొకేషన్‌లో సిగరెట్ తాగడం మానేసింది.
పూర్తి వివరాల్లోకెళ్తే..అన్బరసన్ అనే నూతన దర్శకుడు తెరకెక్కిస్తున్న చిత్రం ‘పేయైు కాణోమ్’. కౌశిక్ అనే యువకుడు తొలిసారి హీరోగా పరిచయం అవు తున్నారు. ఇందులో వివాదాస్పద నటి మీరా మిథున్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇందులో దర్శకుడు తరుణ్ గోపి ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. మీరా మిథున్ సిగరెట్ తాగుతూ కెమెరాకు చిక్కడంపై దర్శకుడు అన్బరసన్ స్పందించారు.
‘సిగరెట్ తాగే అలవాటు ఉంది. ఇది ఆమె వ్యక్తిగత వ్యవహారం. అయితే, ఆమె షూటింగ్ లొకేషన్‌లోనే సిగరెట్లు కాల్చేవారు. ఒక రోజు తాను చూసి లొకేషన్‌లో సిగరెట్ కాల్చొద్దని, కేరవాన్‌లో సిగరెట్ తాగి రావాలని చెప్పాను. ఆ తర్వాత ఆమె లొకేషన్‌లో ఒక్కసారి కూడా సిగరెట్ కాల్చలేదు. పైగా చెప్పినట్టు నడుచుకున్నారు’ అని తెలిపారు.