భారత టెన్నిస్ వెటరన్ స్టార్ లియాండర్ పేస్ ప్రేమలో పడ్డాడా..? అంటే.. అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. హిందీ నటి కిమ్ శర్మతో 48 ఏళ్ల పేస్ డేటింగ్ చేస్తున్నట్టు సమాచారం. తాజాగా ఈ జంట హాలిడే ట్రిప్ కోసం గోవా వెళ్లడంతో వీళ్ల మధ్య ప్రేమాయణం నిజమేనంటూ బాలీవుడ్ కోడై కూస్తోంది.
గోవా రెస్టారెంట్లో వీళ్లిద్దరూ సన్నిహితంగా ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. రెండేళ్ల క్రితం వరకు నటుడు హర్షవర్ధన్‌తో చెట్టాపట్టాలేసుకొని తిరిగిన 41 ఏళ్ల కిమ్.. గతంలో క్రికెటర్ యువరాజ్ సింగ్‌తోనూ రొమాన్స్ చేసిందన్న కథనాలు వచ్చాయి. కాగా, కొన్నాళ్లు నటి రియా పిళ్లైతో సహజీవనం చేసిన పేస్‌కు అయియానా అనే కూతురు ఉంది.