Home / NATIONAL / కరోనా మూడో వేవ్‌ ప్రారంభంలో ఉన్నాం -WHO

కరోనా మూడో వేవ్‌ ప్రారంభంలో ఉన్నాం -WHO

తగ్గిందనుకున్న కరోనా ఉధృతి మళ్లీ క్రమంగా ‘విశ్వ’రూ పం చూపుతోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సం ఖ్య పెరుగుతోంది. వరుసగా తొమ్మిదివారాలపాటు తగ్గు తూ వచ్చిన కొవిడ్‌ మరణాల సంఖ్యలో.. మళ్లీ పెరుగుదల నమోదైంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) గణాంకాల ప్రకారం.. అంతకు ముందు వారంతో పోలిస్తే గత వారం మరణాల సంఖ్య 3 శాతం అధికంగా నమోదైంది.

కిందటివారం ప్రపంచవ్యాప్తంగా 55 వేల కరోనా మరణాలు నమోదయ్యాయి. అలాగే 30 లక్షలకు పైగా కొత్త కేసులు వచ్చాయి. అంతకు ముందు వారంతో పోలి స్తే కేసుల సంఖ్య 10 శాతం పెర గడం గమనార్హం.

ము ఖ్యంగా.. బ్రెజిల్‌, భారత్‌, ఇండోనేషియా, బ్రిటన్‌ దేశాల్లో కేసులు, మరణాలు ఎక్కువగా నమోదవుతున్నాయని డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది. దురదృష్టవశాత్తూ మనం మూడో వేవ్‌ ప్రారంభ దశలో ఉన్నాం. డెల్టా వేరియంట్‌ ప్రపంచవ్యాప్తంగా 111కు పైగా దేశాల్లో ఉంది. త్వరలోనే  అది ప్రబల వేరియంట్‌గా నిలుస్తుందని అంచనా వేస్తున్నాం. ప్రజల రాకపోకలు పెరగడం, కరోనా నిబంధనలు పాటించకపోవడమే వైరస్‌ వ్యాప్తికి కారణం అని తెలిపింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat