నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారి తండ్రి పెద్ది రాజిరెడ్డి గారు అనారోగ్యంతో మరణించడంతో నేడు నల్లబెల్లిలోని పెద్ది నివాసానికి వెళ్లి స్వర్గీయ పెద్ది రాజీ రెడ్డి గారి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు, రైతు బంధు రాష్ట్ర అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ములుగు జెడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్, మహబూబాబాద్ జెడ్పీ చైర్ పర్సన్ కుమారి బిందు, బయ్యారం PACS చైర్మన్ మధుకర్ రెడ్డి, టి.ఆర్.ఎస్ నేతలు గోవింద్ నాయక్, శ్రీకాంత్, ఇతర నాయకులు. పెద్ది కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పెద్ది రాజిరెడ్డి గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించారు
