Home / MOVIES / ‘పుష్ప’ విడుదలకు ముహూర్తం ఫిక్స్

‘పుష్ప’ విడుదలకు ముహూర్తం ఫిక్స్

కరోనా కాస్త తగ్గుముఖం పట్టడంతో సినిమా ఇండస్ట్రీ మళ్లీ దార్లోకి వస్తుంది. థియేటర్లు తెరుచుకున్నాయి. ఒక్కో సినిమా థియేటర్‌ విడుదలకు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే సంక్రాంతి డేట్స్‌ పవన్‌, ప్రభాస్‌, మహేశ్‌బాబు చిత్రాలతో లాక్‌ అయిపోయాయి. తాజాగా అల్లు అర్జున్‌ నటిస్తున్న ‘పుష్ప’ సినిమా విడుదల కూడా ఖరారైంది. 

సుకుమార్‌ దర్శకత్వంలో రెండు పార్టులుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం మొదటి భాగాన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కిస్మస్‌ పండుగకు విడుదల చేస్తున్నట్లు నిర్మాత సంస్థ మంగళవారం ప్రకటించింది.

ఈ నెల 13న ఫస్ట్‌ సింగిల్‌ను విడుదల చేయనున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ పుట్టినరోజు సందర్భంగా సోమవారం దీనికి సంబంధించిన టీజర్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే! ప్రస్తుతం షూటింగ్‌ వేగంగా జరుగుతోంది. ఈ చిత్రంలో బన్నీ సరసన రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తోంది.

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri - medyumlar