Home / MOVIES / సోషల్ మీడియాను షేక్ చేస్తున్న దిగు దిగు దిగు నాగ పాట

సోషల్ మీడియాను షేక్ చేస్తున్న దిగు దిగు దిగు నాగ పాట

హిట్స్, ఫ్లాప్స్‌తో సంబంధం లేకండా వైవిధ్య‌మైన సినిమాలు చేసుకుంటూ వెళుతున్న న‌టుడు నాగ శౌర్య‌. కెరీర్ తొలి నాళ్లలో మంచి విజ‌యాలు సాధించిన నాగ శౌర్య ఇప్పుడు స‌క్సెస్ కోసం చాలా క‌ష్ట‌ప‌డుతున్నాడు.

సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్‌పై లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో వ‌రుడు కావలెను అనే సినిమా చేస్తున్నాడు నాగ‌శౌర్య . ఈ సినిమాలో రీతు వర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. సూర్యదేవర నాగవంశీ నిర్మాణ బాధ్యతలు చేపట్టారు.

అతి త్వ‌ర‌లో సినిమాను విడుద‌ల చేయాల‌ని మేక‌ర్స్ భావిస్తుండ‌గా, చిత్ర ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల‌ను వేగ‌వంతం చేశారు. ఇప్ప‌టికే పోస్ట‌ర్స్, లిరిక‌ల్ సాంగ్స్ విడుద‌ల చేసిన మేక‌ర్స్ తాజాగా ‘దిగు దిగు దిగు నాగ’ లిరికల్ సాంగ్ ఫుల్ వీడియో రిలీజ్ చేశారు.

తెలంగాణలో ‘దిగు దిగు దిగు నాగ’ అనేది చాలా పాపులర్ అయిన జానపద గేయం. శ్రేయా ఘోషల్ పాడిన ఈ పాటకు తమన్ స్వరాలు సమకూర్చగా, అనంత్ శ్రీరామ్ సాహిత్యాన్ని అందించారు.

కొంపాకొచ్చిపోరో కోడెనాగ .. కొంపా ముంచుతాందోయ్ ఈడు బాగా’ లాంటి ప‌ద‌ప్ర‌యోగం చేస్తూ అనంత శ్రీరామ్ అద‌గొట్టాడు. ఈ పాట ఇప్పుడు సంగీత ప్రియుల‌ని ఎంత‌గానో అల‌రిస్తుంది. పాట‌లో రీతూ వ‌ర్మ లుక్ కూడా చాలా బాగుంది. ప్ర‌స్తుతం ఈ పాట సోష‌ల్ మీడియాను షేక్ చేస్తుంది.