Home / SLIDER / ద‌ళితుల‌కు సీఎం కేసీఆర్ శుభ‌వార్త

ద‌ళితుల‌కు సీఎం కేసీఆర్ శుభ‌వార్త

తెలంగాణ లో  హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలోని ద‌ళితుల‌కు ముఖ్య‌మంత్రి కేసీఆర్ శుభ‌వార్త వినిపించారు. ద‌ళిత కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు సీఎం కేసీఆర్ ఎన్నెన్నో సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తున్నారు.

తాజాగా ద‌ళితుల‌ను వ్యాపారులుగా మార్చేందుకు ద‌ళిత బంధు ప‌థ‌కాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్ర‌వేశ‌పెడుతున్నారు ముఖ్య‌మంత్రి.ఈ క్ర‌మంలో హుజురాబాద్‌ నియోజ‌క‌వ‌ర్గంలో ద‌ళిత బంధు అమ‌లుకు రాష్ట్ర ప్ర‌భుత్వం జీవో జారీ చేసింది. ఈ ప‌థ‌కం అమ‌లు కోసం రూ. 500 కోట్లు విడుద‌ల చేస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది.

హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో పైల‌ట్ ప్రాజెక్టుగా తెలంగాణ ద‌ళిత బంధు ప‌థ‌కం అమ‌లు కానుంది. ఈ నెల 16వ తేదీన ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఈ ప‌థ‌కాన్ని హుజురాబాద్ వేదిక‌గా ప్రారంభించ‌నున్నారు. దీనికి సంబంధించి మంత్రులు, అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మొన్న వాసాల‌మ‌ర్రి ద‌ళితుల కోసం ఈ ప‌థ‌కం కింద రూ. 7.60 కోట్లు విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే.