హుజూరాబాద్ నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేరును ప్రకటించడంతో.. టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో పాటు ఆయన మద్దతుదారులు సంబురాలు చేసుకుంటున్నారు.
గెల్లు శ్రీనివాస్ పేరును సీఎం కేసీఆర్ ప్రకటించిన మరుక్షణమే పెద్ద ఎత్తున సంబురాలు చేసుకుంటూ.. టపాసులు కాల్చారు. ఒకరికొకరు స్వీట్లు పంచుకుని సంతోషం వ్యక్తం చేశారు.గెల్లు అభ్యర్థితత్వంపై యువతలో ఉత్సాహం వెలువెత్తితింది.
శ్రీనివాస్ యాదవ్‌ను గెలిపించుకుంటామని నియోజకవర్గంలోని ప్రతి ఊరు, వాడ ఏకోన్ముఖంగా ప్రకటిస్తున్నాయి. హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ అభ్యర్థితత్వాన్ని ఖరారు చేయడంతో సీఎం కేసీఆర్‌కు గొల్ల, కురుమ సంఘాలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాయి.