గ్లాస్‌మేట్స్.. గ్లాస్‌మేట్సూ అంటూ వచ్చిన పాట గుర్తుండే ఉంది కదా. అలా గ్లాస్‌మేట్స్ పాత్రల చుట్టూ తిరిగే ఒక భిన్నమైన సినిమానే ‘బ్రాందీ డైరీస్’. ఈ సినిమా ట్రైలర్ చూస్తేనే మరో ‘అర్జున్‌రెడ్డి’ మాదిరి ఉంటుందని ప్రేక్షకులు భావించారు. ఎన్నో ఊహాలతో థియేటర్‌లోకి ఈ శుక్రవారం బ్రాందీ డైరీస్ వచ్చింది. మొదటి షో నుంచే ఈ సినిమాపై పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. కొత్త తరహా సినిమా అని, తెలుగులోనే అతిపెద్ద ఇండిపెండెంట్ సినిమాగా వచ్చిన ‘బ్రాందీ డైరీస్’ ఎలా ఉందో.. కొత్తవారి ప్రయత్నం ఫలించిందో చదవండి.
ప్రధాన పాత్ర శ్రీను చుట్టూ సినిమా తిరుగుతుంది. శ్రీనుకు శేఖర్, జాన్సన్, వర్మ, కోటి పరిచయమవుతారు. వీరి పరిచయమే మద్యంతో అవుతుంది. శ్రీను సివిల్స్ సాధనలో ఉండగా శేఖర్ ఓ ప్రభుత్యోద్యోగి. కానీ రచయిత కావాలని కలలు కంటుంటాడు. జాన్సన్ పెళ్లయిన ఓ నిరుద్యోగి. ఇక కోటి ఓ చిన్న బిజినెస్‌మేన్. వీరందరినీ ఒకచోట కలిపేదే ఆల్కహాల్. వారి వారి నేపథ్యాలు ఈ మద్యం వేదికగా చర్చకు వస్తాయి. వారి బాధలు, కష్టనష్టాలు చెప్పుకుని ఎంజాయ్ చేస్తుంటారు. వీరి జీవితాల్లో ఏం జరిగింది? అసలు శ్రీనుకు వారితో పరిచయం ఉపయోగపడిందా? లేదా? అసలు మద్యం ఆ గ్లాస్‌మేట్స్‌ను ఏం చేసిందో తెలుసుకోవాలంటే థియేటర్‌కు పరుగెత్తాల్సిందే. కొత్తవారిని ఆశీర్వదించాల్సిందే.
దర్శకుడు కొత్త వాడైనప్పటికీ ఐదుగురు జీవితాలను ఎలాంటి గందరగోళం చెందకుండా చక్కగా తీర్చిదిద్దాడు. ప్రేమ, పెళ్లి, స్నేహం, కెరీర్‌తో పాటు మద్యం నేపథ్యంగా ఈ సినిమా సాగుతుంది. ఈ సినిమా ప్రేక్షకుల జీవితాలకు అద్దం పడుతుంది. నటీనటులు వారి పరిధి మేరకు ఉన్నంతలో బాగా చేశారు. ముఖ్యంగా వర్మ పాత్ర ప్రేక్షకులను ఆలోచించపజేస్తుంది. పాటలు, నేపథ్య సంగీతం సినిమాను మరో మెట్టు ఎక్కించింది. నిర్మాణ విలువలు కథకు తగ్గట్టు.. సినిమాకు ఎలాంటి లోటు లేకుండా నిండుగా ఉన్నాయి. హీరోహీరోయిన్ మధ్య కొంత రొమాన్స్ కూడా సాగింది. అన్నీ భావోద్వేగాలను దర్శకుడు ప్రేక్షకులను కలిగించేలా చేశాడు. వాస్తవికతను తెరపై చూస్తున్న అనుభవం ప్రేక్షకుడు లోనవుతాడు. సంభాషణలు, డీఓపీ సినిమాకు తగ్గట్టు ఉంది.
బ్రాందీ డైరీస్ పేరు చూసి మద్యాన్ని ప్రోత్సహిస్తూ వచ్చిన సినిమాగా భావిస్తే పొరపడినట్టే. అందరూ చూడాల్సిన సినిమా. ఆలోచింపజేసే సినిమా ఇది. కరోనా తర్వాత తెరచుకున్న థియేటర్లకు వచ్చిన ప్రేక్షకులను నిరాశకు గురి చేయకుండా పంపించే బాధ్యతను దర్శకుడు తనపై వేసుకున్నాడు. ఈ సినిమా మంచి మౌత్ టాక్‌తో దూసుకెళ్లే అవకాశం ఉంది. ప్రేక్షకులను థియేటర్లను మళ్లీ రప్పించే బాధ్యత ఈ సినిమా చేయనుంది.
రేటింగ్: 3/5