పంద్రాగస్టు వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాజన్న సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. సిద్దిపేటలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి హరీశ్ రావు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.
నల్లగొండ జిల్లా వ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన పంద్రాగస్టు వేడుకల్లో మంత్రి మహమూద్ అలీ పాల్గొన్నారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.
జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని పరేడ్ గ్రౌండ్‌లో పంద్రాగస్టు వేడుకలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ దామోదర్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. జయశంకర్ భూపాలపల్లిలో జరిగిన వేడుకల్లో ప్రభుత్వ విప్ భాను ప్రకాశ్ రావు పాల్గొన్నారు.