Home / SLIDER / తెలుపు చీర‌లో సింధు త‌ళ‌త‌ళ

తెలుపు చీర‌లో సింధు త‌ళ‌త‌ళ

బ్యాడ్మింట‌న్ కోర్టులో స్మాష్ షాట్ల‌తో అల‌రించే పీవీ సింధు ( PV Sindhu ).. ఇప్పుడు సాంప్ర‌దాయ దుస్తుల్లోనూ ఆక‌ట్టుకుంటోంది. టోక్యో ఒలింపిక్స్ లో బ్రాంజ్ మెడ‌ల్ గెలిచిన హైద‌రాబాదీ ష‌ట్ల‌ర్‌.. త‌న జెర్సీల‌ను ప‌క్క‌న‌పెట్టేసి కొత్త లుక్‌లో క‌ల‌ర్‌ఫుల్‌గా క‌నిపిస్తోంది.

మ‌నీష్ మ‌ల్హోత్రా డిజైన్ చేసిన తెలుపు చీర‌లో సింధు త‌ళ‌త‌ళ మెరిసిపోతోంది. పింక్‌, బ్లూ, ప‌ర్పుల్ త్రెడ్‌వ‌ర్క్ ఉన్న ఆ చీర‌లో .. చాలా స‌హ‌జ‌మైన అందంతో సింధు ఫోటోల‌కు ఫోజు ఇచ్చింది.

త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ ఫోటోల‌ను ఆమె అప్‌డేట్ చేసింది. రెండు రోజుల క్రిత‌మే పోస్టు చేసిన‌ ఆ పూల చీర ఫోటోకు తెగ లైక్‌లు వ‌చ్చేస్తున్నాయి. ఇప్ప‌టికే ఏడు ల‌క్ష‌ల మంది ఆ ఫోటోకు లైక్ కొట్టేశారు.

తెల్ల చీరకు త‌గ్గ‌ట్లే మ్యాచింగ్ బ్లౌజ్ వేసిన సింధు త‌న కొత్త అందాల్లో ప‌ర్ఫెక్ట్‌గా క‌నిపిస్తోంది. ఇక ఆమె గ్లామ‌ర్‌కు చెవి పోగులు మ‌రో అట్రాక్ష‌న్‌గా మారాయి. పెద్ద‌గా మేక‌ప్ లేకున్నా.. చీర‌లో సింధు త‌ళుక్కుమ‌న్న తీరు ఆమె అభిమానుల్ని క‌ల‌వ‌ర‌పెడుతోంది. సంక్రాతి పండుగ వేళ కూడా సింధు సాంప్ర‌దాయ‌క‌ర‌మైన తెలుపు రంగు చీర‌లో ద‌ర్శ‌న‌మిచ్చింది. గోల్డెన్ బోర్డ‌ర్ ఉన్న ఆ చీర‌లో సింధు కేర‌ళ కుట్టీలా క‌నిపించిన విష‌యం తెలిసిందే.