Home / MOVIES / పవన్ ఫ్యాన్స్ కు దేవిశ్రీ ప్రసాద్ సర్ ఫ్రైజ్

పవన్ ఫ్యాన్స్ కు దేవిశ్రీ ప్రసాద్ సర్ ఫ్రైజ్

నేడు (సెప్టెంబర్ 2) పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే. ఈ సందర్భంగా రాక్ స్టార్ దేవీశ్రీప్రసాద్ ఆయన అభిమానులకు ఓ సర్‌ప్రైజింగ్ గిఫ్ట్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ – దేవీశ్రీప్రసాద్ కాంబినేషన్‌లో ‘జల్సా’, ‘అత్తారింటికి దారేది’ చిత్రాలు వచ్చి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ రెండు చిత్రాలకి మాటల మాంత్రీకుడు త్రివిక్రం శ్రీనివాస్ దర్శకత్వం వహించాడు.

అయితే ‘జల్సా’ సినిమా ప్రమోషన్స్ కోసం అప్పట్లో ఓ వీడియో సాంగ్‌ను తయారు చేశామని, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ వీడియోను విడుదల చేయలేకపోయామని తెలిపాడు దేవిశ్రీ.

ఇప్పుడు ఇదే వీడియో సాంగ్‌ను నిర్మాత అల్లు అరవింద్, దర్శకుడు త్రివిక్రం చొరవతో పవర్ స్టార్ బర్త్ డే కానుకగా వదిలి అభిమానులకి సర్‌ప్రైజ్ చేసినట్టు తెలిపాడు. ప్రస్తుతం ఈ సాంగ్ అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటోంది. కాగా పవర్ స్టార్‌కి పలువురు సినీ, రాజకీయ నాయకుల పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat