బీజేపీ కవ్వింపు చర్యలకు పాల్పడుతుందని దీనిని ప్రజలు గమనించాలని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలోని టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీఆర్‌ఎస్ కార్యకర్తలని బీజేపీ నాయకులు ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారని, గత పదిహేను రోజులుగా వారి వ్యవహారం చూస్తే అలాగే కనబడుతుందని అన్నారు. దీనికి సంబంధించి తాము ఎలక్షన్ కమిషన్ తో పాటు పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. గతంలో జరిగిన సంఘటనలే బీజేపీ పన్నుతున్న కుట్రలకు నిదర్శనమన్నారు.
ఆఫీస్‌లోకి చొచ్చుకువచ్చి దాడులు వారు చేసి కేంద్రమంత్రిపై దాడి చేశారంటూ అబద్దపు ప్రచారం చేశారన్నారు. మా కార్యకర్తలపైనే దాడులు చేసి వారిపైనే కేసులు పెట్టింది బీజేపీ కాదా అన్నారు. కమలాపూర్, ఇల్లందకుంటలో చేసిన ప్రయోగాలు విఫలం కావడంతో నిన్న హుజూరాబాద్ మండలంలోని పోతిరెడ్డిపేటలో బీజేపీ గూండాలు హరీష్ రావు వాహనాన్ని అడ్డుకుని దాడి చేసే ప్రయత్నం చేశారన్నారు పల్లా రాజేశ్వర్‌రెడ్డి.