తమిళనాడులో జరిగిన నిజఘటనను ఆధారంగా చేసుకుని రూపొందిన చిత్రం జై భీమ్. హీరో సూర్య ఈ సినిమాను భార్య జ్యోతికతో కలిసి నిర్మించడమే కాదు.. అందులో లాయర్ చంద్రు పాత్రలో నటించి ప్రశంసలు కూడా అందుకున్నారు .
ఇక పోలీస్ లాకప్‌లో చనిపోయిన బాధితుడు రాజన్న భార్య సినతల్లి పాత్రలో నటించిన మలయాళ సుందరి లిజోమోల్ జోస్ పాత్ర కూడా ఎంతో మందిని ఆకర్షించింది. ఈ పాత్ర కోసం తాను ఎంత కష్టపడిందో తాజాగా వివరించింది.
సినతల్లి జీవనం.. వారి పద్దతులు తెలుసుకోవడానికి ప్రతిరోజూ గుడిసెలకు వెళ్ళేదాన్ని. వాళ్లు చెప్పులు వేసుకోరని.. పగలు రాత్రి తేడా లేకుండా వేటకు వెళ్తారని.. అవన్ని పనులు తాను కూడా చేసినట్లు తెలిపింది లిజోమోల్ . సినిమాలో పాము కాటుకు మందులు ఇస్తుంటానని.. అది నిజంగానే నేర్చుకున్నానని తెలిపింది. అంతేకాకుండా.. ఆ గిరిజనులు కేవలం పొలాల్లో ఉండే ఎలుకలను వండుకు తింటారని..వాళ్లలా నేను ఉండాలంటే వాళ్లు చేసినవన్నీ చేయాలి కాబట్టి ఎలుక కూర కూడా తిన్నానని స్పష్టం చేసింది.