బిగ్ బాస్ తో మంచి ఫేమ్ తెచ్చుకున్న యూట్యూబ్ స్టార్ దీప్తి సునయన త్వరలోనే స్క్రీన్ మీద హీరోయిన్ గా మెరవనుందని ఇటీవల వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆ వార్తలపై దీప్తి స్పందించింది.
ఓ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మూవీ కోసం ఒక లీడింగ్ ప్రొడక్షన్ హౌస్ ఆమెను సంప్రదించిందని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని ఆమె స్పష్టం చేసింది.కానీ ఆమెకు సినిమా ఆఫర్లు వస్తున్నప్పటికీ దీప్తి ఒప్పుకోవడం లేదని తెలుస్తోంది.