ప్రముఖ హాట్ యాంకర్ అటు టీవీ రంగంలోనూ, ఇటు సినిమా రంగంలోనూ సక్సెస్‌ఫుల్‌గా రాణిస్తోంది. ఇటీవల ‘పుష్ప’ చిత్రంతో దాక్షాయణిగా నటించిన ఆమె రవితేజ ‘ఖిలాడీ’ సినిమాలో డబుల్ రోల్ చేస్తోందని తెలిసింది.
ఇందులో బ్రాహ్మణ అమ్మాయిగా కనిపించనందని ఫిల్మ్‌నగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. రెండో పాత్ర ఏంటనేది సస్పెన్స్. ఈ విషయాన్ని చిత్ర బృందం కాస్త గోప్యంగా ఉంచింది. అయితే ఇందులో అనుసూయ పోషిస్తున్న రెండు పాత్రల్లో ఓ పాత్ర మరణిస్తుంది.
రెండో పాత్ర చివరి వరకూ ఉంటుందని సమాచారం. రమేశ్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కోనేరు హవీష్ నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 11న సినిమా విడుదల కానుంది.