తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో..మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఓ చిత్రంలో ఆయన సరసన యంగ్ బ్యూటీ మాళవిక మోహన్ నటించబోతుందనే తాజా వార్త ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. రీ ఎంట్రీ తర్వాత చిరు వరుస సినిమాలను కమిటయిన సంగతి తెలిసిందే. వాటిలో యువ దర్శకుడు వెంకీ కుడుముల తెరకెక్కించబోతున్న చిత్రం కూడా ఒకటి.
ఈ సినిమాలో మెగాస్టార్ సరసన త్రిష నటించబోతుందని ఆ తర్వాత శృతి హాసన్ హీరోయిన్‌గా నటించబోతుందని ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే, ఇప్పుడు మాళవిక మోహన్‌ను చిత్రబృందం పరిశీలిస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. మరి దీనిపై మేకర్స్ ఎలా స్పందిస్తారో చూడాలి.
అయితే ప్రస్తుతం మెగాస్టార్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘ఆచార్య’ పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ జరుపుకుంటోంది. ఏప్రిల్ 29న రిలీజ్ చేయబోతున్నామని మేకర్స్ తాజాగా ప్రకటించారు. ఇక ‘గాడ్ ఫాదర్, భోళాశంకర్’ చిత్రాలు షూటింగ్ దశలో ఉన్నాయి. త్వరలో బాబీ దర్శకత్వంలో చిరు నటించబోతున్న సినిమా కూడా మొదలు కానుంది. ఆ తర్వాత వెంకీ కుడుముల సినిమా సెట్స్ మీదకు తీసుకు వస్తారు.