పాన్ ఇండియా హీరో.. యంగ్ రెబల్ స్టార్.. స్టార్ హీరో ప్రభాస్ నటించిన పాన్ ఇండియా ఫిల్మ్ ‘రాధే శ్యామ్’ విడుదల కరోనా కారణంగా ఇప్పటికే ఎన్నో సార్లు వాయిదా పడింది. ఈ సినిమా కోసం దక్షిణాదిలోనే కాదు ఉత్తరాది ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఈ చిత్రాన్ని మార్చి 11న విడుదల చేస్తున్నట్లు ఓ థీమ్ పోస్టర్ ద్వారా చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఒక సినిమాకు రెండు భాషల్లో వేర్వేరు సంగీత దర్శకులు పనిచేయడం ఇదే తొలిసారి.
మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ, కమల్ కన్నన్ విజువల్ ఎఫెక్ట్స్, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్, యూవీ క్రియేషన్స్ నిర్మాణ విలువలు ఈ చిత్రం ప్రత్యేకతలు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో కృష్ణంరాజు పరమహంసగా ఓ ప్రత్యేక పాత్ర పోషించారు. కె.కె.రాధాకృష్ణకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వంశీ, ప్రమోద్, ప్రసీద నిర్మించారు.