ఉక్రెయిన్ లాంటి చిన్న దేశంపై గత పన్నెండు రోజులుగా రష్యా బాంబుల యుద్ధాన్ని కొనసాగిస్తుంది. యావత్ ప్రపంచమంతా చోద్యం చూస్తున్నట్లు మీడియా ప్రకటనలకు పరిమితమై ఉన్నాయి తప్పా ఉక్రెయిన్ రష్యా వివాదాన్ని పరిష్కరించడానికి ముందుకు రావడం లేదు ఏ ఒక్క దేశం.
అయితే ఈ నేపథ్యంలో యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ తన కుటుంబాన్ని క్షేమంగా అణుబంకర్లలో దాచాడు. స్విట్జర్లాండ్ లో ఉంటున్న తన ప్రేయసీ ఒలింపిక్స్ లో స్వర్ణం సాధించిన జిమ్నాస్ట్ అలీనా కబయే వాను,తమకు పుట్టిన నలుగురు పిల్లలను అంతే భద్రంగా పుతిన్ దాచిపెట్టారని అంతర్జాతీయ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వారిని అత్యంత భద్రమైన చాలా రహస్యమైన ప్రాంతంలో నిర్మించిన షాలెలో ఉంచినట్లు ఆ వార్తల సారాంశం. కొండప్రాంతాల్లో నిర్మించే చెక్కల కట్టడాలను షాలె అంటారు.