అది టాలీవుడ్ అయిన బాలీవుడ్ అయిన అఖరికి కోలువుడ్ అయిన కానీ సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లకు గుర్తింపు రావడానికి ఎక్కువ టైం పడుతుంది. కానీ కొంతమంది హీరోయిన్లకు మాత్రం ఒకటీ లేదా రెండు చిత్రాలతోనే ఓవర్ నైట్ స్టార్ డమ్ ను సంపాదించుకుంటారు. అలా ఓవర్ నైట్ స్టార్ అయిన కథానాయిక నేషనల్ క్రష్ రష్మిక మందన్న. కన్నడలో కిరిక్ పార్టీ సినిమాతో సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ప్రస్తుతం సౌత్ టూ నార్త్ వరకు స్టార్ హీరోలతో కలిసి నటిస్తుంది.
ఈ హాట్ బ్యూటీ రష్మిక ప్రస్తుతం తెలుగులో ‘పుష్ప-2’లో నటిస్తుంది. ఇక హీందీలో ఈమె నటించిన రెండు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అయితే రష్మిక తాజాగా హిందీలో మరో క్రేజీ ప్రాజెక్ట్‌లో హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసింది అని సమాచారం.సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన అర్జున్ రెడ్డి అనే చిత్రం టాలీవుడ్‌లో ఎంత సంచలనం సృష్టించిందో అందరికి తెల్సిందే. హిందీలో సందీప్‌రెడ్డి ఇదే సినిమాను షాహిద్ కపూర్‌తో తెరకెక్కించి అక్కడ కూడా బ్లాక్ బస్టర్‌ను సాధించాడు.
ప్రస్తుతం ఈయన రణ్‌బీర్ కపూర్‌తో ‘యానిమల్’ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో రణ్‌బీర్‌కు జోడిగా రష్మిక మందన్న నటించనుంది. గత కొన్ని రోజుల నుంచి రష్మిక ఈ చిత్రంలో స్పెషల్ సాంగ్‌లో నటించనుందని వార్తలు వచ్చాయి. కానీ అవన్ని అవాస్తవమిని.. ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్‌గా నటించనున్నట్లు ప్రకటన వచ్చింది. ప్రస్తుతం ప్రీ ప్రోడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం సమ్మర్‌లో షూటింగ్ మొదలుపెట్టనుంది.