RRR హిట్ తో మంచి జోష్ లో ఉన్న యంగ్ టైగర్ ..స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ మరో సరికొత్త ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు విన్పిస్తున్నాయి.జూనియర్ ఎన్టీఆర్, డైరెక్టర్ అనిల్ రావిపూడిల కాంబినేషన్లో మూవీ రానుందని ఫిల్మ్ నగర్ టాక్.
దర్శకుడు అనిల్ చెప్పిన కథ ఎన్టీఆర్ కు నచ్చిందని సమాచారం. వచ్చే ఏడాది నుంచి షూటింగ్ ప్రారంభమయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఈ సినిమాను నిర్మించనున్నారట. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ, ప్రశాంత్ నీల్, బుచ్చిబాబుతో మూవీలు చేయనున్నాడు.