తెలంగాణ రాష్ట్ర ఆధికార పార్టీ టీఆర్ఎస్ ఏర్పడి ఇరవై ఏండ్లు పూర్తి చేసుకుని ఇరవై ఒకటో ఏటా అడుగెడుతున్న సందర్భంగా రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని హైటెక్స్ లో ఆ పార్టీ వార్శికోత్సవ ప్రజాప్రతినిధుల సమావేశం జరుగుతుంది.
ఈ సమావేశంలో ఈ ఇరవై ఏండ్ల టీఆర్ఎస్ పార్టీ ప్రస్థానం ..సాధించిన విజయాలు గురించి గులాబీ దళపతి,సీఎం కేసీఆర్ గారి నాయకత్వంలో చర్చించనున్నారు. అంతే కాకుండా ఈ ఎనిమిదేండ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమాభివృద్ధి పథకాలతో పాటు రానున్న కాలంలో జాతీయ రాజెకీయాల్లో టీఆర్ఎస్ పాత్ర గురించి విస్తృతంగా చర్చ జరగనున్నది.
దాదాపు మూడువేల మందికిపైగా పాల్గొంటున్న ఈ సమావేశంలో టీఆర్ఎస్ పార్టీ టెక్ సెల్ ప్రజాప్రతినిధులను విశేషంగా ఆకట్టుకుంటుంది. టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్లు దినేష్ చౌదరి,ఎం క్రిషాంక్ (TSMDC చైర్మన్),పాటిమీది జగన్ (TST Chairman),వై సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ టెక్ సెల్ లో పాంప్లెట్,క్యూఆర్ కోడ్ తో ఉన్న పాకెట్ క్యాలెండర్ ను అందజేస్తున్నారు. పాకెట్ క్యాలెండర్ వెనక ఉన్న క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేస్తే ఇప్పటివరకు టీఆర్ఎస్ పార్టీ చేసిన సంక్షేమాభివృద్ద్జి పథకాల గురించి వీడియోలు,ఫోటోలు,ప్రతిపక్షాలకు కౌంటర్లకు సంబంధించి వీడియోలు కన్పిస్తాయి..