నిన్న గురువారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా ప్లేయర్ సునీల్ నరైన్ గొప్ప మైలురాయిని అందుకున్నాడు. ఐపీఎల్లో 150 కన్నా ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్లలో అతను 8వ స్థానంలో నిలిచాడు. ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో డెయిన్ బ్రావో ఉన్నాడు.
అతను 158 మ్యాచుల్లో 181 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. 122 మ్యాచ్‌లు ఆడిన లసిత్ మలింగ మొత్తం 170 వికెట్లు తీసుకున్నాడు. ఇక మూడవ స్థానంలో అమిత్ మిశ్రా ఉన్నాడు. అతను 154 మ్యాచుల్లో 166 వికెట్లు తీశాడు. గురువారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ చేతిలో 4 వికెట్ల తేడాతో ఓడిన కోల్‌కతా ఈ సారి ప్లేఆఫ్‌కు చేరడం కష్టంగానే ఉంది.